Saturday, June 30, 2012

ఎన్నికల ఫలితాలు తెలుగువన్ డాట్ కామ్ చెప్పినట్లే వచ్చాయి

రాష్ట్రంలో 18 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ ఉప ఎన్నికల ఫలితాలు ఇటీవల తెలుగువన్ డాట్ కామ్ అంచనా వేసిన విధంగానే వచ్చాయి. 18 అసెంబ్లీ ఎన్నికల్లో 14 చోట్ల వై.ఎస్.అర్.కాంగ్రెస్ అభ్యర్దులు గెలుపోందడం ఖాయమని నాలుగుచోట్ల హోరాహోరీ పోటీ ఉంటుందని వీటిలో మరో ఒకటి లేదా రెండు చోట్ల వై.ఎస్.అర్.కాంగ్రెస్  పార్టీ అభ్యర్దులకే చాన్స్క్ష్ ఉండే అవకాశమే ఎక్కువగా ఉందని తెలుగువన్ డాట్ కామ్  పోలింగ్ ముగిసిన వెంటనే తెలిపింది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే  వై.ఎస్.అర్.కాంగ్రెస్  పార్టీ అభ్యర్దులు 15 స్థానాల్లో గెలుపొందారు.ఈ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ బాగా పనిచేసిందని, జగన్ పై కాంగ్రెస్,టి.డి.పిలు చేసిన అవినీతి ఆరోపణలు వోటర్లు పట్టించుకోలేదని కూడా తెలుగువన్ డాట్ కామ్ స్పష్టం చేసింది.తెలుగువన్ డాట్ కామ్  అంచనా వేసినట్లు గానే వోటర్లు జగన్ పై అవినీతి ఆరోపణలు పట్టించుకోలేదని తేలింది. తిరుపతిలో చిరంజీవి ప్రభావం పనిచేయదని,వాయిలార్ రవి,గులాం నబీ అజద్ చేసిన ఎన్నికల ప్రచారం వల్ల కాంగ్రెస్ కు ఎటువంటి ప్రయోజనం ఉండదని,నాలుగైదు చోట్ల ఆ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని కూడా  తెలుగువన్ డాట్ కామ్ తెలిపింది.ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఉప ఎన్నికల్లో ఐదు చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులు డిపాజిట్లు కోల్పోయారు.

   నెల్లూరు లోక్ సభ ఉప ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తారని కూడా  తెలుగువన్ డాట్ కామ్ ముందే అంచనా వేసింది. ఈ అంచనాలకు తగ్గట్టుగానే మేకపాటి సుమారు 2.91 లక్షల మెజార్టీతో గెలుపొందారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత  రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమార్పులు ఉంటాయని, త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడినా ఆశ్చర్యపోనక్కర లేదని  తెలుగువన్ డాట్ కామ్ అంచనా వేస్తోంది.

No comments:

Post a Comment