Saturday, June 30, 2012



ఎన్నికల ఫలితాలు తెలుగువన్ డాట్ కామ్ చెప్పినట్లే వచ్చాయి

రాష్ట్రంలో 18 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ ఉప ఎన్నికల ఫలితాలు ఇటీవల తెలుగువన్ డాట్ కామ్ అంచనా వేసిన విధంగానే వచ్చాయి. 18 అసెంబ్లీ ఎన్నికల్లో 14 చోట్ల వై.ఎస్.అర్.కాంగ్రెస్ అభ్యర్దులు గెలుపోందడం ఖాయమని నాలుగుచోట్ల హోరాహోరీ పోటీ ఉంటుందని వీటిలో మరో ఒకటి లేదా రెండు చోట్ల వై.ఎస్.అర్.కాంగ్రెస్  పార్టీ అభ్యర్దులకే చాన్స్క్ష్ ఉండే అవకాశమే ఎక్కువగా ఉందని తెలుగువన్ డాట్ కామ్  పోలింగ్ ముగిసిన వెంటనే తెలిపింది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే  వై.ఎస్.అర్.కాంగ్రెస్  పార్టీ అభ్యర్దులు 15 స్థానాల్లో గెలుపొందారు.ఈ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ బాగా పనిచేసిందని, జగన్ పై కాంగ్రెస్,టి.డి.పిలు చేసిన అవినీతి ఆరోపణలు వోటర్లు పట్టించుకోలేదని కూడా తెలుగువన్ డాట్ కామ్ స్పష్టం చేసింది.తెలుగువన్ డాట్ కామ్  అంచనా వేసినట్లు గానే వోటర్లు జగన్ పై అవినీతి ఆరోపణలు పట్టించుకోలేదని తేలింది. తిరుపతిలో చిరంజీవి ప్రభావం పనిచేయదని,వాయిలార్ రవి,గులాం నబీ అజద్ చేసిన ఎన్నికల ప్రచారం వల్ల కాంగ్రెస్ కు ఎటువంటి ప్రయోజనం ఉండదని,నాలుగైదు చోట్ల ఆ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని కూడా  తెలుగువన్ డాట్ కామ్ తెలిపింది.ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఉప ఎన్నికల్లో ఐదు చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులు డిపాజిట్లు కోల్పోయారు.

   నెల్లూరు లోక్ సభ ఉప ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తారని కూడా  తెలుగువన్ డాట్ కామ్ ముందే అంచనా వేసింది. ఈ అంచనాలకు తగ్గట్టుగానే మేకపాటి సుమారు 2.91 లక్షల మెజార్టీతో గెలుపొందారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత  రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమార్పులు ఉంటాయని, త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడినా ఆశ్చర్యపోనక్కర లేదని  తెలుగువన్ డాట్ కామ్ అంచనా వేస్తోంది.

అమెరికాలో తెలుగు పండుగ

  • హ్యూస్టన్‌లో నాటా సంబరాలు
  • హాజరైన సినీనటులు బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్‌, శివారెడ్డి
  • రాజకీయ ప్రముఖులు తీగల కృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గోనె ప్రకాశరావు
  • టీవీ ఫైవ్‌ ఎండి రవీంద్రనాథ్‌
  • నాటాలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
  • డ్యాన్సులతో హోరెత్తించిన ఎన్నారై యువత
  • నాటా ఉత్సవాలు టీవీ ఫైవ్‌ వీక్షకులకు ప్రత్యేకం
అమెరికాలోని హ్యూస్టన్‌ నగరంలో నాటా సంబరాలు అంబరాలు అంబరాన్నంటుతున్నాయ్‌. మొదటి రోజు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినీనటులు బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్‌, శివారెడ్డి, మధుషాలిని, రాజకీయ నేతలు తీగల కృష్ణారెడ్డి, గోనె ప్రకాశరావుతోపాటు టీవీ ఫైవ్‌ ఎండీ రవీంద్రనాధ్‌లను నాటా ఘనంగా  సత్కరించింది.నాటా ఉత్సవాల్లో సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయ్‌. ఎన్నారై యువతులు డ్యాన్సులతో హుషారెత్తించారు. ఉత్సవాలకు కొత్త శోభను తీసుకొచ్చారు.

దశ తిరిగిన శృతి హసన్‌

  • టాలీవుడ్‌ నుంచి వెల్లువెత్తుతున్న ఆఫర్లు
  • ఎన్‌టిఆర్‌, అల్లు అర్జున్‌ సినిమాల్లో శృతి
  • కాజల్‌,తమన్నా,సమంతలకు పోటీ ఇవ్వనున్న శృతి
శృతిహసన్‌కి భాగ్యలక్ష్మి కారక్టర్‌ లాటరీలా తగిలింది. దీంతో, ఒకప్పుడు ఐరన్‌లెగ్‌ అన్న నోటితోనే ఆఫర్ల దండకం చదువుతున్నారు ప్రొడ్యూసర్లు. ప్రస్తుతం అమ్మడి కటాక్షం కోసం రెండు భారీ ప్రాజెక్ట్‌లు వెయిటింగ్‌లో ఉన్నాయి. 

విజయనగరం


విజయనగరంలో సాగునీటి యుద్ధం

  • రెండు గ్రామాల సాగునీటి వివాదం
  • గంగచోలిపెంట-పురిడిపెంట రైతుల మధ్య ఘర్షణ
  • రాళ్లు రువ్వుకున్న రైతులు, నలుగురు రైతులకు గాయాలు
పంట కాల్వల వివాదం రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారి తీసింది. విజయనగరం జిల్లా గంగచోలిపెంట, పురిడిపెంట గ్రామాల మధ్య సాగునీటి కోసం వివాదం తలెత్తింది. ఆండ్రా రిజర్వాయర్‌ పంట కాల్వల సరిహద్దులను ఇరిగేషన్‌ శాఖ ఇది వరకు నిర్ణయించింది. అయితే ఈ సరిహద్దుల్లో లోపాలు ఉన్నాయంటూ రెండు గ్రామాల  రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు రైతులు రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో నలుగురు రైతులు గాయపడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.






విజయనగరం జిల్లాలో సాగునీటి ప్రాజెక్ట్‌లు వెలవెల

  • జీరోస్థాయికి పడిపోయిన నీటి నిల్వలు
  • ఆందోళన చెందుతున్న అన్నదాతలు
  • వరుణుడి కరుణ కోసం ఎదురు చూపులు
సాగునీటి ప్రాజెక్ట్‌ల్లో చుక్కనీరు లేకపోవడంతో విజయనగరం జిల్లా రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌ సాగు కష్టంగా మారిందని వాపోతున్నారు. ప్రాజెక్ట్‌ల్లో పుష్కలంగా నీరు చేరితే తప్ప వ్యవసాయం చేయలేమని అంటున్నారు.విజయనగరం జిల్లాలో సాగునీటి ప్రాజెక్ట్‌లు వెలవెలపోతున్నాయి. అయిదు ప్రధాన ప్రాజెక్ట్‌ల్లో సాగునీరు జీరో స్థాయికి పడిపోయింది. నీటి నిల్వలు లేక ప్రాజెక్ట్‌లు మైదానాలుగా మారాయి. ఈ పరిణామంతో సుమారు లక్షా ఎభై వేల ఎకరాల పంట ప్రశ్నార్థకంగా మారిందని  రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఖరీఫ్‌ సాగు అగమ్యగోచరంగా మారిందని వాపోతున్నారు. జిల్లాలో పెద్ద ప్రాజెక్ట్‌ తోటపల్లితో సహా జంఝావతి, తాటిపూడి, ఆండ్ర ప్రాజెక్ట్‌ల పరిస్థితి అయోమయంగా తయారయ్యాయి. భారీ వర్షాలు నమోదైతే తప్ప ఈ పరిస్థితిలో మార్పు వచ్చేలా కనబడటం లేదు. వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తూ, రైతన్నలు దుక్కు దున్నుతున్నారు.సాగునీటి ప్రాజెక్ట్‌లు జలకళతో కళకళలాడాలని రైతన్నలు గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా చిలకసాలెంలో పేలుడు

  • నాగార్జున ఆగ్రో కెమికల్‌ కంపెనీలో ఎగిసిపడ్డ మంటలు
  • ముగ్గురు చనిపోయినట్లు అనుమానం ?
  • 40 మందికి గాయాలు
  • చిలకపాలెంలో నాగార్జున అగ్రిఫార్మాలో పేలిన బాయిలర్‌
  • చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు
  • మంటలు అదుపు చేస్తున్న ఫైర్‌ సిబ్బంది
  • 40 మంది కార్మికులు రిమ్స్‌కు తరలింపు
  • ముడు, నాలుగు బ్లాకులకు విస్తరించిన మంటలు
  • భయంతో పరుగులు తీసిన కార్మికులు
  • మంటలు అదుపు చేసిన ఫైర్‌ సిబ్బంది
  • క్షతగాత్రులు రిమ్స్‌కు తరలింపు
  • ఫ్యాక్టరీని చుట్టుముట్టిన పొగ
  • పేలిన రియాక్టర్‌, ఐదుగురు కార్మికుల మృతి
  • లోపల మరికొంత మంది కార్మికులు?
  • 10 కి.మీ మేర గ్రామాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు
  • పొగపీల్చడం హానికరమంటున్న యాజమాన్యం
  • ఎగిసిపడుతున్న మంటలు, కమ్ముకున్న దట్టమైన పొగ
  • ఐదో బ్లాక్‌ నుంచి మిగతా బ్లాకులకు విస్తరిస్తున్న మంటలు
  • మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్న రెండు ఫైరింజన్లు
  • భయాందోళనలో స్థానికులు
  • గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశం
  • పేలుడు ఘటనపై నివేదిక కోరిన సీఎం
  • సహాయక  చర్యలు పర్యవేక్షిస్తున్న అధికారులు
  • పేలడానికి సిద్దంగా ఉన్న మరో రియాక్టర్‌ ?
  • ఘటనా స్థలానికి చేరుకున్న ఇద్దరు డిస్సీలు, పోలీసు బలగాలు
శ్రీకాకుళంలో భారీ పేలుడు సంభవించింది. చిలుకపాలెం నాగార్జున అగ్రికెమ్‌  కంపెనీలో రియాక్టర్‌ పేలింది. దీంతో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని శ్రీకాకుళంలోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.  ఇదిలా ఘటన జరిగిన సమయంలో 200 మంది వరకు కార్మికులు ఫ్యాక్టరీలో ఉన్నట్లు సమాచారం. మరికొందరు లోపలే చిక్కుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఐదో బ్లాక్‌లో జరిగిన ఈ ప్రమాదంతో మిగిలిన బ్లాకులకు మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో రెండు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు  ప్రయత్నిస్తున్నాయ్‌. ఇతర ప్రాంతాల నుంచి ఫైరింజన్లను చిలుకపాలెంకు తరలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని, 17 మంది గాయపడ్డారని చెప్పారు.

నాగార్జున అగ్రికెమ్‌ ఫ్యాక్టరీలో పేలుడుతో కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక కంగారు పడ్డారు. ఇంతలోనే పొగ మొత్తం చుట్టుముట్టడంతో కొందరు అస్వస్థతకు గురయ్యారు. లోన చిక్కుకున్నవారు బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే మరికొన్ని రియాక్టర్లకు మంటలంటుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న ప్రజలను అక్కడినుంచి తరలిస్తున్నారు. ఎవ్వరినీ ఫ్యాక్టరీ పరిసరాలకు అనుమతించడం లేదు.

నాగార్జున అగ్రికెమ్‌ పేలుడుతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ కమ్మేసింది. లోపల ఏంజరుగుతుందో తెలియక కార్మికులు కలవరపడుతున్నారు. లోపల ఎంత మంది ఉన్నారో తెలియక ఆందోళన చెందుతున్నారు. వారిని రక్షించాలంటూ అగ్నిమాపక సిబ్బందిని వేడుకుంటున్నారు. తమవారి జాడ కోసం కార్మికుల బంధువులు రోధిస్తున్నారు. ఇదిలా ఉంటే గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

నాగార్జున అగ్రికెమ్‌ కర్మాగారంలో అగ్ని ప్రమాదం 

  • శ్రీకాకుళంలో భారీ పేలుడు
  • చిలుకపాలెం నాగార్జున అగ్రికెమ్‌లో ప్రమాదం
  • పేలిన రియాక్టర్‌, ఇంకా అదుపులోకి మంటలు
  • రంగంలోకి దిగిన పది ఫైరింజన్లు
  • ఎవరూ చనిపోలేదని ప్రకటించిన కలెక్టర్‌
  • గాయపడ్డ 17 మందికి రిమ్స్‌లో చికిత్స
  • లోపల 15 మంది చిక్కుకున్నట్లు అనుమానం
  • పేలడానికి సిద్ధంగా ఉన్న మరికొన్ని రియాక్టర్లు
  • చుట్టుముట్టిన దట్టమైన పొగ
  • సమీప గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తనున్న అధికారులు
  • గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశం
  • పేలుడు ఘటనపై నివేదిక కోరిన సీఎం
  • సహాయక  చర్యలు పర్యవేక్షిస్తున్న అధికారులు
  • పోలీసు బలగాలతో ఘటనా స్థలానికి చేరుకున్న ఇద్దరు డిస్సీలు
ఎప్పట్లా పొద్దున్నే డ్యూటీకి వెళ్లిన కార్మికులు.. అగ్ని కీలలకు బలి కావాల్సి వస్తుందని ఊహించలేదు. చుట్టుపక్కల గ్రామాలవారూ బాధితులయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల మండలాన్ని విషవాయువులు కమ్మేశాయి. నాగార్జున అగ్రికెమ్‌ కర్మాగారంలో సంభవించిన అగ్ని ప్రమాదం అంతకంతకూ విస్తరించింది. అగ్నిమాపక సిబ్బంది మూడు గంటల అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చాయ్‌. జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా చిలుకపాలెంలోని ఫార్మా ప్లాంట్‌లో చిన్న నిప్పు రవ్వ పెద్ద ప్రమాదానికి దారితీసింది. ఓ బ్లాక్‌లోని రియాక్టర్‌లో పేలుడు సంభవించింది. అగ్ని ప్రమాదం చూస్తుండగానే బడబాగ్నిగా మారింది. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చూస్తుండగానే మరో రెండు బ్లాక్‌లకు అగ్నికీలలు విస్తరించాయి. అంతే.. మంటలకు తోడు.. విషవాయువులు భారీగా వెలువడ్డాయి. కిలోమీటర్ల మేర విస్తరించాయి. దీంతో స్థానికంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. 

ప్లాంట్‌లో పనిచేస్తున్న కార్మికులు బయటకు పరుగు తీసినా లాభం లేకపోయింది. పేలుడు ధాటికి సుమారు 40 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని శ్రీకాకుళంలోని రిమ్స్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్లాంట్‌లో మరికొందరు కార్మికులు గల్లంతైనట్టు అనుమానిస్తున్నారు. మందుల కంపెనీలో తలెత్తిన అగ్ని ప్రమాదంపై సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు తనకు నివేదిక ఇవ్వాలన్నారు. అగ్రికెమ్‌ కర్మాగారం నుంచి వెలువడిన మంటలు, విషవాయువులు గాలినీ, ధూళిని కలుషితం చేసేశాయి. వాటి ప్రభావం చుట్టుపక్కల ప్రాంతాలపై తీవ్రంగా పడనుంది. దీంతో.. సుమారు 10 గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. దీంతో.. ఎచ్చెర్ల మండలంలో భయాందోళనలు నెలకొన్నాయి.

Srikakulam: A massive fire broke out at the Nagarjuna Agrichem Limited plant in Arinama Akkivalasa area of Andhra Pradesh's Srikakulam district at around 12 noon on Saturday.
While there are no reports of any casualties, 15 people have suffered minor injures and have been admitted to a local hospital.
There were many workers inside the factory when the fire, whose cause is still unknown, broke out and all of theme were rescued. Several fire tenders were sent to the factory to fight the blaze.
Andhra Pradesh: Fire at Srikakulam chemical plant
Srikakulam DSP Panasareddy said that the fire has been brought under control.